వర్జీనియాకు దీటుగా విశాఖ: చంద్రబాబునాయుడు

అమరావతి : ‌వర్జీనియాకు దీటుగా విశాఖ మారుతుందని  ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. ప్రకాశం జిల్లాలో వివిధ సంస్థలు రూ.24,500కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయని తెలిపారు. నిన్న ఒక్కరోజే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రూ.లక్షకోట్ల పెట్టుబడులతో ఒప్పందాలు జరిగాయని తెలిపారు. 9వ రోజు జన్మభూమి-మాఊరు కార్యక్రమంపై ముఖ్యమంత్రి చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామసభలను విజయవంతం చేయాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో లక్షా 26వేల ఉద్యోగాలు కల్పించే పరిశ్రమలు రానున్నాయని చెప్పారు. విశాఖలో డేటా సెంటర్ హబ్, డేటా సెంటర్ పార్కులు, సోలార్ పార్కులు రానున్నాయని ఆసియా పల్ప్ అండ్ పేపర్ మిల్లు వస్తోందని, దీని ద్వారా ప్రత్యక్షంగా 4,500మందికి, పరోక్షంగా 12వేల మందికి ఉపాధి కలగనుందని చెప్పారు. 50వేల మంది రైతులకు దీంతో ప్రయోజనం కలగనుందని సీఎం వివరించారు. రామాయపట్నం పోర్టు, భావనపాడు పోర్టులు రానున్నాయని.. లాజిస్టిక్స్ హబ్‌గా ఏపీ మారనుందన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమలో పెద్దఎత్తున పరిశ్రమల ఏర్పాటు జరుగుతోందని, వెనుకబడిన జిల్లాలలో సంపద సృష్టిస్తున్నామని చెప్పారు. యువతకు భారీగా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, వీటన్నింటినీ ప్రజలకు వివరించాలని అధికారులకు సీఎం సూచించారు. టెలీకాన్ఫరెన్స్‌లో జిల్లాల కలెక్టర్లు, నోడల్ అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *