ఘనంగా సంక్రాంతి సంబరాలు

ఒంగోలు మునిసిపల్ హై స్కూల్ ఆవరణలో సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. ముత్యాల ముగ్గులు ఆకర్షించాయి. సంప్రదాయ గ్రామీణ క్రీడలు ఆకట్టుకున్నాయి. తొక్కుడు బిళ్ళ, తాడాట,పతంగులు,హరిదాసుల కీర్తనలు,గంగిరెద్దుల విన్యాసాలు, కోలాటం,కబ్బడి పోటీలు,బొంగరాల ఆటలు, భోగిమంటలు,పౌరాణిక వేషధారణలు,పోతురాజుల విన్యాసాలు,గంగదేవర వేషధారణ,బుడబుక్కల,జంగమ దేవర,హరిదాసుల నృత్యాలు,జానపద పాటలు,భరతనాట్యం, కూచిపూడి నృత్యాలు,వాయిద్య కళాకారుల ప్రదర్శన,డప్పుల జోరు, వ్యవసాయ శాఖ ప్రదర్శన,రైతు రధం ట్రాక్టర్లు,ఒంగోలు జాతి ఎద్దుల ప్రదర్శన,పొట్టేళ్ల ప్రదర్శన,సంప్రదాయ వంటలు, డి.ఆర్.డి.ఏ.వెలుగు బృందాలు తయారు చేసిన ఆహారాలు,ఐ.సి.డి.ఎస్.వారి బొమ్మల కొలువు, చిన్నారుల భోగిపళ్ళు…ఇలా మున్సిపల్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సంబరాల్లో రాష్ట్ర అటవీశాఖ మంత్రి శిద్దా రాఘవరావుతో పాటు శాసనమండలి సభ్యులు కరణం బలరాం, మాగుంట శ్రీనివాసరెడ్డి, జాయింట్ కలెక్టర్ నాగలక్ష్మిలు పాల్గొన్నారు. ఆసక్తిగా అన్నీ తిలకించారు. పల్లె వాతావరణం ఉట్టిపడేలా సాంప్రదాయ రీతిలో,నగర జీవనంలో జీవిస్తూ మర్చిపోతున్న మన సనాతన భారతీయ సంప్రదాయాలు,గ్రామీణ క్రీడలను గుర్తుకు వచ్చే విధంగా సంక్రాంతి శోభతో సంబరాలు నిర్వహించిన జిల్లా అధికారులను వారు అభినందించారు.

అధికారులకు ప్రశంసా పత్రాలు అందిస్తున్న మంత్రి శిద్దా రాఘవరావు
బలరాంకు జన్మానం

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *