రామలింగేశ్వర స్వామి ఆలయంలో తాబేలు

గుంటూరు జిల్లా కంకిపాడులోని గంగా, పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో స్వామి వారి పాన్పు మట్టంపై బుధవారం ఉదయం తాబేలు దర్శనమిచ్చింది. ఆలయ అర్చకులు కుందుర్తి రమేష్‌, గురుస్వామి ఐనాల విశ్వేశ్వరరావు బుధవారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో ఆలయ ద్వారాలు తెరిచారు. గంగా, పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి పాన్పుమట్టంపై తాబేలు దర్శనమిచ్చింది.ద్వారాలు పూర్తి స్థాయిలో వేసి ఉండగా, ఈ తాబేలు ఎటు వైపు నుంచి వచ్చిందన్న విషయమై అర్చకులు ఆరా తీస్తున్నారు. రాగా కార్తీక మాసంలో ఇటువంటి అద్భుతం జరగడం శుభసూచకమని ఆలయ అర్చకులు కుందుర్తి రమేష్‌ అంటున్నారు. దీంతో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *