కాంతి పుంజాలు

చిమ్మచీకట్లను
చీల్చివేసే కాంతిపుంజాలకు
మీ అసమాన ధైర్యసాహసాలే
తరగని ఇంధనాలు
ఊపిరినే పణంగా పెట్టి
ఊరంతా వెలుగునిస్తున్న
రాత్రి సూరీళ్లు మీరు
మీ పాదస్పర్శతో
నిలువెత్తు స్తంభాలు పునీతమవుతుంటే
మీ కరస్పర్శతో
ఇనుపతాళ్లు వెలుగు వాహకాలవుతున్నాయి
నేటి వేగవంత వ్యవస్థ గమనానికి
మూలహేతువైన
మీ త్యాగపూరిత చలన శక్తికి
నా పాదాభివందనమ్..

(ఒంగోలు గద్దలగుంట పార్క్ వద్ద నిన్నటి (17.11.2017) ఉదయం
మా ఇంటి ముందు అలవోకగా విద్యుత్ స్తంభాలను ఎగబాకుతూ కొత్త వైర్లను వేస్తున్న కుర్రాళ్లను చూశాక
నా అక్షర స్పందన ఇది)

-కుర్రా ప్రసాద్ బాబు

 

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *