ఆడపిల్లలు భారం కాదు..వరం

దేశానికి అసలైన ఆస్తి వారే
అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు

బాలికలు భారం కాదని తల్లిదండ్రులతో పాటు దేశానికి ఆస్తిఅని ఏపీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు పిలుపునిచ్చారు.కౌమార బాలికసాధికారత జిల్లా స్థాయి స్పూర్తి – ప్రేరణ అవగాహన కార్యక్రమంలో భాగంగా సత్తెనపల్లి జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా స్పీకర్ కోడెల మాట్లాడుతూ గతంలో తల్లిదండ్రులు బారంగా బావించే ఆడపిల్లల నేడు ప్రపంచంలో, దేశంలో మగవాళ్లకు దీటుగా అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారన్నారు.రాష్ట్రంలో చదువునే పిల్లలకు చంద్రబాబు ప్రభుత్వం kg to pg అన్ని సౌకర్యాలు కల్పిస్తుందన్నారు.పిల్లలు చదువుతోపాటు విద్యాబుద్ధులు, మంచినడవడికలు నేర్చుకోని అనుకున్నది సాధించడానికి హర్డు వర్క్ చేయాలని పిలుపునిచ్చారు.నేడు రాష్ట్రంలో, దేశంలో స్త్రీ పురుషులు తేడాలేకుండా అన్ని రంగాల్లో సమాన అవకాశాలు ఉన్నాయన్నారు.ఆడపిల్లలను ఎవ్వరైన అవహేళన చేస్తే చోక్కా పట్టుకుని నిలదీయాలన్నారు.
మహిళా సాధికారత, హక్కుల కల్పనే ధేయంగా ఉమెన్ పార్లమెంట్ నిర్వహించామన్నారు.ప్రపంచంలోనే మొదటి సారిగా అలాంటి వినూత్నమైన కార్యక్రమం మన రాష్ట్రంలో చేసుకున్నామన్నారు.పిల్లలు తల్లిదండ్రుల కన్న టీచర్ల దగ్గర ఎక్కువగా ఉంటారని కావున విద్యార్థులను తమ సొంత పిల్లలుగా భావించాలన్నారు.
ప్రత్యేకంగా మన సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల పరిధిలో ఆడపిల్లల ఆత్మగౌరవం కాపాడడానికి ఇళ్లతో పాటు పాఠశాలలో కలిపి దాదాపు 40వేలకు పైగా మరుగుదొడ్లు నిర్మించుకున్నామన్నారు.ఈ సందర్భంగా త్వరలో కేంద్రీయ విద్యాలయం నూతన భవనాలకు శంకుస్థాపన చేయనున్నట్లు ప్రకటించారు.నిన్న డిల్లీలో ఇదే విషయమై కేంద్ర మంత్రి ప్రకాష్ జవధేకర్ ను కలిసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో స్పీకర్ కోడెల, మున్సిపల్ చైర్మన్ రామస్వామి, డిప్యూటి deo రామకృష్ణ, ఇతర విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *