చైనా చేతిలో ఖండాంతర క్షిపణి

ప్రపంచంలోని ఏ మూలనున్న లక్ష్యాలనైనా తాకేలా.. ఒకేసారి 10 అణ్వాయుధాల్ని మోసుకుపోయే ఖండాతర క్షిపణి వచ్చే ఏడాదికల్లా చైనా అమ్ముల పొదిలోకి చేరనుంది.డాంగ్‌ఫెంగ్‌ –41గా పిలుస్తున్న ఈ కొత్త క్షిపణి.. మాక్‌ 10 కంటే వేగంతో దూసుకుపోగలదు. ప్రత్యర్థి క్షిపణి రక్షణ వ్యవస్థలోకి చొచ్చుకుపోయి తన దారికి అడ్డువచ్చే వేటినైనా తునాతునకలు చేయగల సత్తా ఈ ఖండాంతర క్షిపణి సొంతమని చైనా ప్రభుత్వ వార్తా సంస్థ గ్లోబల్‌ టైమ్స్‌ పేర్కొంది.2012లో ప్రకటించిన ఈ క్షిపణిని ఇంతవరకూ ఏడు సార్లు పరీక్షించగా.. తాజాగా మరోసారి నవంబర్‌ మొదటి వారంలో పరీక్షించినట్లు సమాచారం.2018 ప్రథమార్ధానికి ఈ అత్యాధునిక క్షిపణి చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీకి అందుబాటులోకి రానుంది. 12 వేల కి.మి. దూరంలో లక్ష్యాల్ని ఛేదించే డాంగ్‌ఫెంగ్‌–41లో మూడంచెల ఘనరూప ఇంధన వ్యవస్థను ఏర్పాటుచేశారు. ఇది ఒకేసారి 10 అణ్వాయుధాల్ని మోసుకుపోయి వాటిని వేర్వేరు లక్ష్యాలపై  ప్రయోగించగలదని గ్లోబల్‌ టైమ్స్‌ వెల్లడించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *