ap news

పే రివిజన్ కాదు..పే రివర్స్ కమిషన్

  • ఉద్యోగస్థులకి తీవ్ర నష్టం
  • టీడీపీ ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు

పే రివర్స్ కమిషన్ 2022 వల్ల ఉద్యోగస్థులకి తీవ్ర నష్టమని టీడీపీ ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు పేర్కొన్నారు. శుక్రవారం మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మట్లాడిన మాటలు మీ కోసం… దేశంలో మొట్టమొదటిసారిగా ఏపీ ఉద్యోగస్థులు రివర్స్ పీఆర్సీ పొందే అవకాశాన్ని జగన్ రెడ్డి కల్పించారు. ఇది పే రివిజన్ కమిషన్ కాదు.. పే రివర్స్ కమిషన్. పీఆర్సీ, ఫిట్‌మెంట్‌ను ప్రకటించి 13 లక్షల ఉద్యోగస్థులను బాధపెట్టారు. దీన్ని ఒక బ్యాడ్, వ్రష్ట్ పీఆర్సీగా అనుకోవచ్చు. 27 శాతం ఐఆర్ ఇచ్చాక ఫిట్‌మెంట్ ఏమాత్రం తగ్గినా జీతాలు తగ్గుతాయనే సామాన్య విచక్షణా జ్ఞానం ప్రభుత్వానికి లేదు. ఈ పీఆర్‌సీతో రిటైర్డ్ అవ్వబోయే ఉద్యోగస్థులకి ఖచ్చితంగా నష్టం జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వంతో కలిసి చేసిన నయవంచనే ఈ ఫిట్‌మెంట్ ప్రకటన. ఇంత ఛీప్ పీఆర్సీ ఎవ్వరూ, ఎప్పుడూ ఎక్కడా చూసి ఉండ‌రు. ఈ పీఆర్సీ, ఫిట్ మెంట్‌తో భవిష్యత్తులో ఎంత నష్టం జరుగుతుందో ఉద్యోగులు ఒకసారి గమనించాలి. సీపీఎస్ పై నిర్ణయం తీసుకోవడానికి జూన్ దాకా సమయం అనవసరం. పీఆర్సీతో ఉద్యోగులకు రూపాయి కూడా బెనిఫిట్ లేదు. ఈ పీఆర్సీ, ఫిట్ మెంట్ ప్రకటన నయవంచన తప్ప మరొకటి కాదు. . 1.7.2019 నుంచి పీఆర్సీ అమలు చేస్తే 23 శాతం ఫిట్ మెంట్ తో అందరికీ జీతాలు తగ్గుతాయి. 13 వేల బేసిక్ తో ఎంప్లాయి ఉన్నాడో వాళ్లకు 27 ఫిట్ మెంట్ ఇచ్చియున్నట్లయితే వారు కొత్త పీఆర్సీలో 26,500 బేసిక్స్ తో ఫిక్స్ అవుతారు. గతంలో టీడీపీ హయాంలో ఉద్యోగస్థులు సంతృప్తికరంగా ఉండేవారు. ఏ పీఆర్సీ అయినా ప్రతి ఉద్యోగికి లాభం జరగాలి తప్ప నష్టం జరగకూడదు. ఈ ప్రిన్సిపుల్ ఆధారంగానే గతంలో రాజశేఖర్ రెడ్డి , 2004కు ముందు చంద్రబాబు అడిగారు. సెంట్రల్ పీఆర్సీ శాలరీ ఉండదని మేం నిరాకరించాం. ఇందులో ఎంతమంది లాభపడతారో, అంతమంది నష్టపోతారు కాబట్టి మేం వద్దన్నాం. ముఖ్యమంత్రి బాహాటంగా సెంట్రల్ గవర్నమెంట్ స్కేల్స్ ని అడాప్ట్ చేసుకుందాం ఆ పీఆర్సీ పది సంవత్సరాలకు ఇస్తామని ప్రకటిస్తే ఇంతవరకు ఏ ఉద్యోగ సంఘ నాయకుడు కూడా ఖండించలేదు. ఉద్యోగ సంఘ నాయకులకు అవగాహన లేదు. సెంట్రల్ పీఆర్సీ, స్టేట్ పీఆర్సీకి తేడా తెలియదు. ఫిట్ మెంట్ తగ్గితే ఏ విధంగా నష్టపోతారనేది తెలియకపోవటం, అవగాహన లోపం తో రాష్ట్రంలో 13 లక్షల మంది ఉద్యోగులు నష్టపోయే పరిస్థితిని తీసుకొచ్చారు. ప్రభుత్వాన్ని ఏమనాలో ఉద్యోగస్థులే తేల్చుకోవాలి. ప్రభుత్వానికి బుద్ధి చెప్పే సమయమొచ్చింది, అవకాశం కూడా వస్తుంది. దాన్ని ఉద్యోగులు ఉపయోగించుకోవాలి. నష్టపోతున్నవారికి మా సానుభూతి ప్రకటిస్తున్నాం. రాబోయే కాలంలో ఇంకెంత నష్టం జరుగుతుందో? ఇప్పటికైనా సంఘ నాయకులు మేల్కొనాలి. పే రివర్స్ కమిషన్ 2022 ఉద్యోగస్థులకి తీవ్ర నష్టం కలిగిస్తుంది. రాబోయే కాలంలో ఇంకా నష్టం జరగకుండా చూసుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగస్థులు ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెబుతారని టీడీపీ ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు జోస్యం చెప్పారు.

Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *