నేడు భారత్ రానున్న మానుషి

మిస్‌వరల్డ్ మానుషి చిల్లర్ ఈరోజు లండన్ నుంచి భారత్ వస్తున్నారు. ఆమె వస్తున్న ఫ్లయిట్ ఈరోజు ఉదయం 11.55 నిమిషాలకు ముంబైలోని ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు చేరుకోనుంది. ఈ నేపధ్యంలో ఆమెకు స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. దీనికితోడు ఆదివారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. లండన్‌లో మానుషి పాల్గొనాల్సిన కార్యక్రమాల్లో కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి. దీంతో మానుషి నిర్నీత వ్యవధి కన్నా నాలుగు రోజుల ముందుగానే భారత్ వస్తున్నారు. ఈ విషయమై మానుషి సోదరి దేవాంగన్ చిల్లర్ మాట్లాడుతూ ఇప్పటివరకూ ‘మాను’తో మాట్లాడటం కుదరలేదన్నారు. అయితే మానుషి శనివారం వస్తున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ పెట్టారని తెలిపారు. మానుషికి స్వాగతం పలికేందుకు ఆమె తల్లిదండ్రులు ముంబై చేరుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *