ఆధార్ తో తప్పిపోయిన పిల్లల ఆచూకీ

తప్పిపోయిన 500 మందికిపైగా పిల్లల ఆచూకీ ఆధార్‌ సాయంతో లభ్యమైందని యూఐడీఏఐ (భారతదేశ విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ) సీఈవో అజయ్‌ భూషణ్‌ పాండే తెలిపారు. గతకొన్ని నెలల్లోనే వీరి ఆచూకీ దొరికిందని ఢిల్లీలో జరిగిన గ్లోబల్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ సైబర్‌ స్పేస్‌-2017 కార్యక్రమంలో తెలిపారు. అనాథాశ్రమాల్లోని చిన్నారులకు ఆధార్‌ అనుసంధాన ప్రక్రియ చేపట్టినప్పుడు వారి వివరాలతో ఇదివరకే ఆధార్‌ ఉన్నట్లు తెలిపారు.దీని ద్వారా తప్పిపోయిన పిల్లల ఆచూకీని తెలుసుకునే వీలుందన్నారు. చిన్నప్పుడు తప్పిపోయిన పిల్లలు పెద్దయ్యాక దొరకడం లాంటి సన్నివేశాలు సినిమాల్లోనే కనిపించేవని, కానీ ఇప్పుడు ఆధార్‌ వల్ల కూడా సాధ్యమవుతుందని అజయ్‌ చమత్కరించారు. సీఆర్‌ఐ అనే స్వచ్ఛంద సంస్థ లెక్కల ప్రకారం 2013 నుంచి 2015 వరకు చిన్నారులు తప్పిపోతున్న కేసులు 84 శాతం పెరిగాయి. ప్రతిరోజు దాదాపు 180 మంది పిల్లలు తప్పిపోతున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఆధార్‌ వివరాలను ప్రభుత్వ పథకాలకు అనుసంధానించడం ద్వారా నకిలీలను తొలగించడంతో పాటు ఏటా 10 బిలియన్‌ డాలర్లు ఆదా చేయవచ్చని అన్నారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *