ఈజిప్టులో ఉగ్రవాదుల హత్యాకాండ

ఈజిప్టులోని సంక్షుభిత ఉత్తర సైనాయ్‌ ప్రాంతంలోని ఓ మసీదుపై సాయుధ దుండుగులు విరుచుకుపడి రక్తపాతం సృష్టించారు.శుక్రవారం ప్రార్థనలు చేసేందుకు వచ్చిన వారిని లక్ష్యంగా చేసుకొని బాంబు పేల్చటంతో పాటు ప్రాణభయంతో పారిపోతున్న వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. అల్‌ అరిష్‌ నగరంలోని అల్‌ రౌదా మసీదులో సాయుధ దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. 235 మందికిపైగా మృతి చెందగా మరో 109మంది గాయపడ్డారు. ఇది ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐఎస్‌) ఉగ్రవాదుల ఘాతుకమేనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నాలుగు వాహనాల్లో వచ్చిన సాయుధులు తొలుత అత్యంత శక్తిమంతమైన బాంబును విసిరారు. ఆ తర్వాత ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీస్తున్న నిరాయుధులైన ప్రజలపై కాల్పులు జరపటంతో మసీదు ప్రాంగణంలో, ఆ సమీపంలో పదుల సంఖ్యలో మృతదేహాలు చెల్లాచెదురుగా  పడిపోయాయి.ఈ దాడిని భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తీవ్రంగా ఖండించారు. హత్యాకాండను పిరికివాళ్ల చర్యగా అభివర్ణించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *