ఇంద్రకీలాద్రిపై త్రాచు పాములు

విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మ ఆలయం వద్ద శనివారం రెండు త్రాచుపాముల సంచారం భక్తుల్లో కలకలం రేపింది. కొండపైనున్న క్యూలైన్ల నుంచి భక్తులు అమ్మవారి దర్శనానికి వెళ్తున్న సమయంలో పక్కనే ఉన్న ఖాళీ ప్రదేశంలో రెండు త్రాచు పాములు కన్పించాయి. దీంతో ఆ పాములు ఎక్కడ క్యూలైన్లలోకి ప్రవేశిస్తాయేమోనన్న భయంతో భక్తులు బయటకు పరుగులు తీశారు. గమనించిన భద్రతా సిబ్బంది అటువైపు వెళ్లేందుకు ప్రయత్నించేలోపే అవి మట్టిలోపలికి వెళ్లిపోయాయి.కాసేపటికే భక్తులు యథావిధిగా క్యూలైన్లలో నిలబడి అమ్మవారి దర్శనం చేసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *