దామచర్ల జనార్దన్ నామినేషన్

నామినేషన్ దాఖలు చేస్తున్న దామచర్ల జనార్దన్, పక్కన ఆయన సోదరుడు దామచర్ల సత్యతో పాటు కుటుంబసభ్యులు

ఒంగోలు అసెంబ్లీ టిడిపి అభ్యర్ధి దామచర్ల జనార్దనరావు శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. వల్లూరమ్మ తల్లి ఆలయంలో, గద్దలగుంటలోని కోదండరామస్వామి ఆలయంలో పూజలు చేసిన అనంతరం కుటుంబసభ్యులు, ముఖ్య నేతలతో కలిసి వచ్చి ఒంగోలు ఆర్డీవో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారిని కలిసి నామినేషన్ దాఖలు చేశారు. ఆయన సోదరుడు దామచర్ల సత్యతో పాటు తన సతీమణి, కుమార్తెలు, మున్సిపల్ మాజీ చైర్మన్లు యక్కల తులసీరావు, మంత్రి శ్రీనివాసరావుతో తదితరులు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. నామినేషన్ అనంతరం మీడియాతో మాట్లాడారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *