కర్ణాటక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రత్నప్రభ

కర్ణాటక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా తెలుగువారైన కె.రత్నప్రభ నియమితులయ్యారు. ప్రస్తుతం అదనపు ముఖ్యకార్యదర్శిగా పనిచేస్తున్న ఆమెను సీఎస్‌గా నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి సుభాష్ చంద్ర కుంటియా పదవీకాలం ఈనెలాఖరుకు ముగియనున్న నేపథ్యంలో ఆ పదవికి పలువురు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారుల పేర్లను పరిశీలించిన ప్రభుత్వం ఎట్టకేలకు రత్నప్రభను ఎంపిక చేసింది.1981వ బ్యాచ్‌కు చెందిన రత్నప్రభ గత 15 ఏళ్లకుపైగా కర్ణాటకలో సేవలందిస్తున్నారు. తొలుత ఆమె వైజాగ్‌ ఎక్స్‌పోర్ట్‌ ప్రాసెసింగ్‌ జోన్‌ అభివృద్ధి కమిషనర్‌గా 1995లో బాధ్యతలు నిర్వర్తించారు. 2004 వరకు అక్కడ పనిచేసిన ఆమె ఆ సమయంలో
ఎగుమతులను రూ.350 కోట్లకు తీసుకెళ్లి చరిత్ర సృష్టించారు. 2007-09 మధ్య ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్‌స్టేట్‌ డిప్యూటేషన్‌పై సేవలందించారు. అనంతరం కర్ణాటక రాష్ట్రాన్ని తన సేవల కోసం ఎంచుకున్న ఆమె 2012 వరకు కర్ణాటక  ఐటీశాఖ ముఖ్య కార్యదర్శిగా సేవలందించారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *