ఉత్తర కొరియాలో ఖండాతర క్షిపణి ప్రయోగం

ఉత్తరకొరియా మరోసారి ఖండాంతర క్షిపణి ప్రయోగం నిర్వహించింది. దక్షిణ ప్యాంగాన్ ప్రావిన్స్ లోని ప్యాంగ్ సాంగ్ నుంచి ఈ క్షిపణిని ప్రయోగించినట్లు దక్షిణకొరియా వార్తాసంస్థలు పేర్కొన్నాయి.ఈ క్షిపణి సుమారు 50 నిమిషాల పాటు ప్రయాణించినట్లు జపాన్ ప్రభుత్వ అధికారులు తెలిపారు. గతంలో కొన్ని ఉత్తరకొరియా క్షిపణులు జపాన్ మీద ప్రయాణించగా, ఈసారి అలా జరగలేదని తెలిపారు.సుమారు 1000 కి.మీ. (620 మైళ్లు) దూరం ప్రయాణించిన ఈ క్షిపణి జపాన్ సముద్రంలో పడిపోయింది.క్షిపణి ప్రయోగం గురించి తెలిసిన వెంటనే అమెరికా రక్షణ కార్యదర్శి జేమ్స్ మాటిస్.. అమెరికా ప్రధాని డొనాల్డ్ ట్రంప్‌కు క్షిపణి ప్రయోగం గురించి వివరించారు. ఇప్పటివరకు నిర్వహించిన పరీక్షల్లోకెల్లా ఈ క్షిపణి అత్యంత ఎత్తుకు చేరినట్లు మాటిస్ తెలిపారు.దక్షిణ కొరియా ప్రధాని మూన్ జేయిన్ కూడా ప్రయోగం జరిగిన వెంటనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో మాట్లాడారు. అనంతరం అమెరికా వైట్ హౌస్ ఒక ప్రకటన విడుదల చేస్తూ.. ఉత్తరకొరియా నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించింది. క్షిపణి ప్రయోగం అమెరికాకే కాకుండా మొత్తం ప్రపంచానికే ప్రమాదకరమని పేర్కొంది.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *