ప్రారంభమైన మెట్రో

హైదరాబాద్ లో మెట్రో సేవలు ప్రారంభమయ్యాయి. రెండు కారిడార్ల పరిధిలో 30 కిలోమీటర్ల మార్గంలో మెట్రో రైళ్లు తిరగనున్నాయి. 24 మెట్రో స్టేషన్ల నుంచి ప్రయాణికులు తమ గమ్య స్థానాలను చేరుకునేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు రైళ్లను నడపనున్నారు’ అని తెలిపింది. ప్రయాణికులతో కూడిన మెట్రో రైలు మొదటి ప్రయాణం ఈ తెల్లవారుజామున ప్రారంభమైంది.నాగోల్-మియాపూర్ మధ్య మెట్రో సేవలు ప్రారంభమయ్యాయి.నగరవాసులు మెట్రో ప్రయాణం చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. తొలి రోజు లక్ష మంది ప్రయాణికులు మెట్రో జర్నీని ఆస్వాదించనున్నట్లు అంచనా. మియాపూర్-నాగోలు నడుమ 18 రైళ్లు పరుగులు తీస్తూ 24 స్టేషన్లలో ఆగనున్నాయి. ఇరు చివరల గమ్యస్థానాల మధ్య 64 నిమిషాల ప్రయాణ సమయం పడుతుంది. మెట్రో సర్వీసు ప్రధాని చేతుల మీదుగా నిన్న ప్రారంభమైన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *