‘రంగుల’ గ్యాలరీలో రవివర్మ జయంతి వేడుకలు

ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుడు రాజా రవి వర్మ 171వ జయంతి వేడుకలను సోమవారం ఒంగోలులోని రంగుల ఆర్ట్ గ్యాలరీలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. ప్రముఖ చిత్రకారుడు డాక్టర్ మాచిరాజు రామచంద్రరావు, సాహితీవేత్తలు మంచికంటి వెంకటేశ్వరరెడ్డి, శాంతివనంతో పాటు సంస్థ నిర్వాహకురాలు సంధ్య, సమ్మర్ క్యాంప్ విద్యార్ధులు పాల్గొన్నారు. చిత్రకళలో రాజా రవివర్మ విశిష్టతను ఈ సందర్భంగా సంధ్య విద్యార్ధులకు వివరించారు. భారతీయ సంప్రదాయ, పాశ్చాత్య చిత్రకళలో రవివర్మ ఒక చరిత్రగా నిలిచిపోయారని వివరిస్తూ మచ్చుతునకలుగా భావించే రవివర్మ చిత్రాల గొప్పతనాన్ని వివరించారు.

చిత్రలేఖనంలో నిమగ్నమైన విద్యార్ధులు

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *