అంతర్జాతీయ ప్రమాణాలతో బ్యాట్మింటన్ స్టేడియం

ఈనెల 9న ఒంగోలులో ప్రారంభించనున్న
రాష్ట్ర అటవీశాఖ మంత్రి శిద్దా రాఘవరావు
రాష్ట్రానికే తలమానికం : శిద్దా సుధీర్
సుధీర్ సహకారం, మురళీకృష్ణ కృషి అభినందనీయం

ప్రకాశంజిల్లా బ్యాట్మింటన్ క్రీడాకారులను అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దడమే లార్డ్ కృష్ణ బ్యాట్మింటన్ అకాడమీ లక్ష్యమని అకాడమీ చైర్మన్ శిద్దా సుధీర్ బాబు తెలిపారు. ఈ నెల 9 వ తేదీ సాయంత్రం ఆధునిక సౌకర్యాలతో, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన లార్డ్ కృష్ణ బ్యాట్మింటన్ అకాడమీ ఇండోర్ స్టేడియాన్ని ప్రారంభించనున్నట్టు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా అకాడమీ కార్యాలయంలో ఆదివారం అకాడమీ ప్రతినిధులు కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సుధీర్ కుమార్ మాట్లాడారు. ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికే తలమానికంగా లార్డ్ కృష్ణ బ్యాట్మింటన్ అకాడమీ ఇండోర్ స్టేడియం ఒంగోలులో ఏర్పాటు చేశామనీ, ఈ నెల 9న రాష్ట్ర అటవీశాఖ మంత్రి శిద్దా రాఘవరావు చేతులమీదుగా ఇండోర్ స్టేడియాన్ని ప్రారంభించనున్నట్టు తెలిపారు. 2016 లో లార్డ్ కృష్ణ బ్యాట్మింటన్ అకాడమీని ప్రారంభించి ఎంతో మంది ఔత్సాహిక క్రీడాకారులకు శిక్షణ అందించినట్టు తెలిపారు. జిల్లా, రాష్ట్ర, అంతరాష్ట్ర బ్యాట్మింటన్ క్రీడా లీగ్ పోటీల్లో అకాడమీ క్రీడాకారులు పాల్గొని అనేక బహుమతులు సాధించారన్నారు. జిల్లాలో మరెందరో క్రీడారత్నాలను తీర్చిదిద్దే ఉద్దేశ్యంలో స్టేడియాన్ని నిర్మించినట్టు తెలిపారు. హైదరాబాద్ లోని పుల్లెల గోపి చంద్ అకాడమీ ఇండోర్ స్టేడియం తరువాత అదే స్థాయిలో జిల్లాలో ఇండోర్ స్టేడియాన్ని తాము నిర్మించామని తెలిపారు. సరైన క్రీడావేదికలు లేనందున బ్యాట్మింటన్ లో ప్రకాశంజిల్లా వెనకబడి ఉందనీ, ఆ లోపం తీర్చడానికి అద్దంకి మురళి కృష్ణ ఇండోర్ స్టేడియం నిర్మాణానికి శ్రీకారం చుట్టారని తెలిపారు.

ఇండోర్ స్టేడియం నిర్మాణాన్ని పరిశీలిస్తున్న శిద్దా సుధీర్ బాబు

వ్యక్తిగత శిక్షకుడు గా భాస్కర్ బాబు

ప్రముఖ బ్యాట్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ వ్యక్తిగత శిక్షకుడు పి.యు.భాస్కర్ బాబు నేతృత్వంలో లార్డ్ కృష్ణ షటిల్ అకాడమీ క్రీడాకారులకు శిక్షణ అందించనున్నట్టు తెలిపారు. అకాడమీ లో క్రీడాకారులకు ఆధునిక వసతి, జిమ్, వైద్యులు, బాడీ మసాజ్, క్యాంటిన్ సదుపాయం, వాకింగ్ ట్రాక్, ఐస్ బాత్, సమావేశ మందిరం, సింథటిక్ కోర్ట్, ఒకే సారి నాలుగు టీమ్స్ ఆడే సౌకర్యంతో విశాలమైన ఇండోర్ గేమ్ స్టేడియం, నిరంతరం విద్యుత్ కోసం జనరేటర్, ఆర్.ఓ.ప్లాంట్ తదితర వసతులు ఒనగూర్చినట్టు తెలిపారు. ఈ స్టేడియం అంతర్జాతీయ క్రీడలకు వేదిక కానుందని తెలిపారు. అల్ ఇండియా బ్యాట్మింటన్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్,టి.ఓ.సి.చైర్మన్ కరణం పున్నయ్య చౌదరి మాట్లాడుతూ ప్రకాశంజిల్లా బ్యాడ్మింటన్ క్రీడా చరిత్రలో నూతన అధ్యాయానికి ఈ నెల 9 వ తేదీ నాంది కానున్నదని తెలిపారు. ప్రభుత్వ ఆర్ధిక సహకారం ఆశించకుండా బ్యాట్మింటన్ క్రీడపై మక్కువతో అద్దంకి మురళీకృష్ణ, ఆయన సతీమణి పద్మ ప్రియలు శిద్దా సుధీర్ సహకారం ,ప్రోత్సాహంతో అత్యాధునిక బ్యాట్మింటన్ ఇండోర్ స్టేడియాన్ని ఒంగోలు లో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఇండోర్ స్టేడియం చీఫ్ కోచ్ గా ప్రఖ్యాత బ్యాట్మింటన్ శిక్షకుడు పి.యు. భాస్కర్ బాబు గారు అంగీకారం తెలపటం లార్డ్ కృష్ణ అకాడమీ మొదటి విజయంగా భావిస్తున్నానని పున్నయ్య చౌదరి తెలిపారు. భాస్కర్ బాబు తన శిక్షణలో ఎంతోమంది బ్యాట్మింటన్ క్రీడాకారులను ఉత్తమ బ్యాట్మింటన్ క్రీడాకారులుగా తీర్చిదిద్దారని తెలిపారు. 12 మంది అంతర్జాతీయ క్రీడాకారులుగా ఎదిగారని తెలిపారు. లార్డ్ కృష్ణ బ్యాట్మింటన్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షుడు అద్దంకి మురళీకృష్ణ మాట్లాడుతూ ఈ నెల 9 వ తేదీ సాయంత్రం 7 గంటలకు మంత్రి శిద్దా రాఘవరావు చేతులమీదుగా ఇండోర్ స్టేడియాన్ని ప్రారంభిస్తామననీ, క్రీడాకారులు, క్రీడాభిమానులు ప్రతి ఒక్కరూ ఈ ప్రారంభ వేడుకల్లో పాల్గొనాలని కోరారు.ఈ కార్యక్రమంలో అకాడమీ సలహాదారు ఎమ్.శివరాం, అకాడమీ సభ్యులు దండు శ్రీనివాసరావు, శ్రీహరి,మన్నం రఘుబాబు,హఫీజ్ తదితరులు పాల్గొన్నారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *