చంద్రబాబుకూ, ప్రజలకు శ్రీవారి ఆశీస్సులు

తిరుమల వెంకన్నను దర్శించుకున్న శిద్దా

నిత్యాన్నదన సత్రంలో భోజనం చేస్తున్న శిద్దా దంపతులు

రాష్ట్ర ప్రజలకు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి వెంకటేశ్వరస్వామి ఆశీస్సులు ఉండాలనీ, తెలుగుదేశం మళ్ళీ భారీ మెజారిటీతో అధికారంలోకి రావాలని రాష్ట్ర అటవీశాఖ మంత్రి శిద్దా రాఘవరావు ఆకాంక్షించారు. శిద్దా తన సతీమణి లక్ష్మీ పద్మావతితో కలసి మంగళవారం ఉదయం తిరుమల స్వామి వారి కళ్యాణోత్సవం వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం మహా లఘు దర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలనీ, రాష్ట్రాభివృద్ధి కోసం నిరంతరం కృషి చేైస్తున్న చంద్రబాబునాయుడికి వెంకటేశ్వర స్వామి కరుణాకటాక్షాలు మెండుగా ఉండాలని శ్రీవారిని కోరుకున్నట్టు తెలిపారు. అనంతరం శిద్దా దంపతులు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన శాలలో అన్నప్రసాదాలు స్వీకరించారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *