సౌందర్యమూర్తులు

బుట్టలో పండ్లమ్ముకుంటున్నారు బాధ్యతల బరువును మోస్తున్నారు వయసుడిగిన మా అమ్మలు మము కన్న మా తల్లులు భూదేవంత సహనశీలురు..బాధలు పంచుకుంటూ జీవన యాతన చెప్పుకుంటూ పిల్లలు చూసేదెవరో చూడనిదెవరో ఆ రెక్కలు వడలే దాకా ఆ సత్తువ తగ్గే దాకా ఆ చూపు సన్నగిల్లేదాకా అలుపెరగక కష్టించే అమృతమూర్తులు..శ్రమైక జీవన సౌందర్య రాశులు..అమ్మలారా మీ పాదాలకు వందనం…మీ పాద ధూళి సోకిన నేల పవిత్రం నీరు పవిత్రం సకల చరా చరా సృష్టి పవిత్రం..జననంలో, మరణంలో వీటి నడుమ నిరతరం పడి లేస్తున్నజీవనయానంలో మీ తలపుల భాగ్యం కలిగించమని ప్రభువుని ప్రార్థిస్తున్నాం. ఎంతయినా మీ కష్టంతో పెరిగిన మా రెక్కలు మీ త్యాగంతో ప్రవహిస్తున్న మా నెత్తురు ప్రాణమున్నంతవరకు మనుషులుగా బతికే దీవెనలందించండి తల్లులారా..!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *