రంగుల ఆర్ట్స్ గ్యాలరీలో మదర్స్ డే

 

విద్యార్థులు, వారి తల్లులతో గ్యాలరీ నిర్వాహకురాలు సంధ్య

ఒంగోలులోని రంగుల ఆర్ట్స్ గ్యాలరీలో శనివారం మదర్స్ డే నిర్వహించారు. వేసవి శిక్షణా తరగతులకు హాజరవుతున్న విద్యార్ధుల అమ్మలు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్యాలరీ నిర్వాహకులు సంధ్య రంగుల మాట్లాడుతూ ‘అమ్మ ప్రేమ దక్కిన వారే కోటీశ్వరులు’ అని వ్యాఖ్యానించారు. ‘‘అమ్మలేనిదే బ్రహ్మ కూడా లేడు..అమ్మంటే అనుబంధం, అనురాగం..ఆత్మీయత..సృష్టిలో అమ్మను మించిన అపురూపరమైనదేదీ’’ లేదని విద్యార్ధులకు వివరించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి విద్యార్ధులు గీసిన చిత్రాలను వారి అమ్మలకు బహుమతులుగా అందించారు.

మాట్లాడుతున్న ఒక విద్యార్ధి తల్లి, పక్కన గ్యాలరీ నిర్వాహకురాల సంధ్య

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *