రౌడీషీటర్ల పై నిఘా ఉంచండి..అదుపు చేయండి

ఆధునిక సాంకేతిక పద్దతులను వాడండి
దొంగతనాల నివారణకు ఎల్.హెచ్.ఎం.సిలపై
ప్రజలకు అవగాహన కలిగించండి
సమీక్షా సమావేశంలో జిల్లా ఎస్పీ సిద్దార్ద్ కౌశిల్

సమీక్షా సమావేశంలో పాల్గొన్న దర్శి సబ్ డివిజన్ పరిధిలోని పోలీస్ అధికారులు

రౌడీషీటర్లపై నిఘా ఉంచి వారిని అదుపు చేయాలని జిల్లా ఎస్ పి సిద్దార్ద్ కౌశిల్ పోలీస్ అధికారులను ఆదేశించారు. ప్రతినెలా నిర్వహించే సమీక్షా సమావేశంలో భాగంగా శనివారం ఒంగోలులోని గెలాక్సీ సమావేశ మందిరంలో దర్శి సబ్ డివిజనల్ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. రౌడీషీటర్లపై ఉన్న కేసుల విచారణను సత్వరం పూర్తి చేయాలనీ, కౌన్సిలింగ్ చేసి వారి చర్యలను అదుపులో ఉంచాలన్నారు. 2017 నుంచి 2019 వరకు నమోదయిన గ్రేవ్ కేసుల విచారణను సత్వరం పూర్తి చేయాలన్నారు. గ్రేవ్ కేసులతో పాటు హత్యలు, ఇతర కీలకమైన కేసుల్లో గాయాలను, గుర్తులను స్పష్టంగా ఫొటోలు తీయాలన్నారు. పెండింగ్ లో ఉన్న నాన్ బెయిలబుల్ కేసులను కూడా ఎగ్జిక్యూట్ చేయాలని ఆదేశించారు. ఎన్.హెచ్.ఆర్.సి, ఎస్.హెచ్.ఆర్.సిలు అడిగిన వెంటనే సమాచారం పంపించాలన్నారు. జిల్లాలో అమలవుతున్న ఆధునిక సాంకేతిక పద్దతులను ఉపయోగించి రౌడీషీటర్లను ఇ-వెరిఫై ద్వారా చెక్ చేయాలనీ, ఎల్.హెచ్.ఎం.ఎస్ గురించి ప్రజలకు మరింత అవగాహన కలిగించాలన్నారు. దొంగతనాలను అరికట్టేందుకు ఎల్.హెచ్.ఎం.ఎస్ లను బాగా ఉపయోగించుకునే విధంగా ప్రజలకు అవగాహన కలిగించాలన్నారు. దర్శి డిఎస్పీ ఎన్.నాగరాజు, డిసిఆర్ బి డిఎస్పీ విజయకుమార్, సిసిఎస్ డిఎస్పీ ఎ.ప్రసాద్ కుమార్, ఎస్.పి సిసి ఎస్.కె సంధాని భాష, దర్శి, అద్దంకి,, పొదిలి, దర్శి సబ్ డివిజనల్ ఎస్.ఐ తదితరులు పాల్గొన్నారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *