బూచేపల్లి సుబ్బారెడ్డి కన్నుమూత

బూచేపల్లి సుబ్బారెడ్డి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పిస్తున్న డాక్టర్ ఆదిమూలపు సురేష్

దర్శి శాసనసభ మాజీ సభ్యుడు బూచేపల్లి సుబ్బారెడ్డి ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నఆయన శనివారం ఉదయం పది గంటలకు హైదరబాద్ లోని ఒక ప్రయివేట్ ఆసుపత్రిలోకన్నుమూశారు. 2004లో దర్శి నుంచి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసి ఘన విజయం సాధించిన సుబ్బారెడ్డి మంచికి మారుపేరుగా నిలిచారు. గ్రానైట్ వ్యాపార రంగంలోనూ ప్రముఖునిగా ఉన్న సుబ్బారెడ్డి చీమకుర్తిలో ఇంజనీరింగ్ కాలేజీ కూడా స్థాపించారు. 2009లో తన కుమారుడు శివప్రసాద్ రెడ్డిని రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. 2009లో శివప్రసాద్ రెడ్డి కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలుపొందారు. బూచేపల్లి మృతి వివిధ రాజకీయపార్టీల నేతలు ప్రగాఢ సంతాపం తెలిపారు. ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ హైదరాబాద్ లో ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. వైకాపా ముఖ్య నేతలు మాగుంట శ్రీనివాసరెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డిలు బూచేపల్లితో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ప్రగాఢ సంతాపం ప్రకటించారు. బూచేపల్లి మృతికి రాష్ట్ర అటవీశాఖ మంత్రి శిద్దా రాఘవరావు ఒక ప్రకటనతో తీవ్ర సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *