అంగన్‌వాడీల అభివృద్ధికి చేయూత

అంగన్ వాడీ కేంద్రాల రూపురేఖలు మరింత గా మారబోతు న్నాయి. రాజధాని గ్రామాల్లోని రెండు, మూడు అంగన్‌వాడీ కేంద్రాలను విలీనం చేసి ఎన్నారై నిధులతో అన్ని రకాల మౌలిక వసతి సౌకర్యాలు కల్పించనున్నారు. ఈ సంధర్భంగా బుధవారం గుంటూరు పార్లమెంట్ సభ్యులు గల్లా జయదేవ్ సోదరి రమాదేవి మండలం లోని ఎర్రబాలెం అంగన్ వాడీ కేంద్రాలను జెడ్పీటీసీ ఆకుల జయసత్య తో కలసి పరిశీలించారు. ఐసీడీసీ పథకం అమలుపై ఆరా తీశారు. ప్లేస్కూల్స్‌కు దీటుగా అంగన్‌వాడీ కేంద్రాలు ఉండేలా ప్రణాళికలు రచించడం జరుగుతుందని ఆమె తెలిపారు. అంగన్ వాడీ కేంద్రం లో హాల్, కిచెన్ నిర్మించడంతో పాటు పిల్లలకు ఆట పాటలతో కూడిన విద్యను అందించేందుకు తమ వంతు సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని ఆమె తెలిపారు. అంగన్ వాడీ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమం లో ఏసీడీపీవో అరుణ కుమారి పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *