‘వివేకానంద’ విద్యార్ధులకు శిద్దా అభినందన

దొనకొండ వివేకానంద హై స్కూల్ విద్యార్థులను రాష్ట్ర మంత్రి శిద్దా రాఘవరావు, ఆయన సతీమణి లక్ష్మీ పద్మావతిలు అభినందించారు. ఒంగోలులో తన నివాసానికి బుధవారం పాఠశాల యాజమాన్యంతో కలిసి వచ్చి తమను కలిసిన విద్యార్ధులను వారు అభినందించారు. గ్రామ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచేలా ఉత్తమ శిక్షణ అందించిన పాఠశాల ఉపాధ్యాయ బృందాన్నీ, యాజమాన్యాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కరస్పాండెంట్ ఎమ్.వి.సురేష్,టీచింగ్ స్టాఫ్ హనుమంతు,డేవిడ్,అంకయ్య,ఉత్తమమైన ప్రతిభతో మెరుగైన పాయింట్స్ సాదించిన దొనకొండ కు చెందిన విద్యార్థులు ఏ.భావన రెడ్డి,పి.పద్మ,ఎస్.శైలజ,గురువంశీ, చందు,బాలాజీ,జయ సందీప్ పాల్గొన్నారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *