కౌంటింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు

అధికారులతో సమావేశం నిర్వహించిన
జిల్లా కలెక్టర్ వాడరేవు వినయ్ చంద్

సమావేశానికి హాజరైన వివిధ శాఖల అధికారులు

కౌంటింగ్ కేంద్రాలలో సిబ్బందికీ, ఏజెంట్స్ కు మౌలిక సదుపాయాలు కల్పించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వి.వినయ్ చంద్ అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక ఒంగోలు కలెక్టరేట్ లోని కంట్రోల్ రూంలో జిల్లా అధికారులతో కౌంటింగ్ అధికారులు, ఏజెంట్లకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు తీసుకోవాలని చర్యలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైజ్, పేస్ ఈ నెల 23వ తేదీన ఒంగోలు రైజ్, పేస్ ఇంజనీరింగ్ కాలేజీ ల్లో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నిర్వహించనున్న సందర్భంగా కౌంటింగ్ అధికారులు, సిబ్బంది అందరూ 23 వతేది ఉదయం5 గంటలకు సిద్ధంగా ఉండాలని ఆయన చెప్పారు. కౌంటింగ్ కేంద్రాలకు ఇంటర్నెట్, వైఫై సిస్టమ్ ఏర్పాటు చేయాలని బిఎస్ఎన్ఎల్ అధికారులను ఆదేశించారు. కౌంటింగ్ కేంద్రాలల్లో కౌంటింగ్ కు అంతరాయం కలగకుండా నిరంతరం విద్యుత్ సరఫరా చేయాలని విద్యుత్ శాఖ ఎస్.ఇ సుబ్బరాజు ను ఆదేశించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా మెడికల్ క్యాంప్ లు ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు తెలిపారు. కౌంటింగ్ కేంద్రంలో సిబ్బందికీ, ఏజెంట్స్ కు త్రాగునీటి సౌకర్యం కల్పించాలని గ్రామీణ నీటి సరఫఱా శాఖ ఎస్.ఇ ని ఆదేశించారు. పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా చేపట్టాలన్నారు. సిబ్బందికి టాయిలెట్ సౌకర్యాలు కల్పించాలని ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ ను ఆదేశించారు. కౌంటింగ్ సిబ్బంది ని ఒంగోలు నుంచి కౌంటింగ్ కేంద్రానికి తీసుకువెళ్లడానికి రవాణా సౌకర్యం కల్పించాలని రవాణా శాఖ ఉప కమీషనర్ సుబ్బారావు ను ఆదేశించారు. .కౌంటింగ్ కేంద్రాల్లో సిబ్బందికి, ఏజెంట్స్ కు, పోలీసు సిబ్బందికి ఉదయం అల్ఫాహారం,స్నాక్స్, భోజన సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, జాయింట్ కలెక్టర్2 ఏ.సిరి,ప్రత్యేక కలెక్టర్ చంద్రమౌళి, జిల్లా రెవెన్యూ అధికారి వెంకట సుబ్బయ్య, సి.పి.ఓ వెంకటేశ్వర్లు, స్టెప్ సి.ఇ.ఓ బి.రవి, సర్వశిక్ష అభ్యా న్ పి.ఓ వెంకటేశ్వర రావు,జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *