ఎయిడ్స్ అవగాహనా మాసంగా డిసెంబర్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్ధ (APSACS) కార్యనిర్వహక సమితి సమావేశం రాష్ట్ర వైద్య,ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య అధ్యక్షతన ఏపీ సచివాలయంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎయిడ్స్ వ్యాధి నియంత్రణ మరియు నివారణకు సంబందించిన ఆంశాలపై చర్చించారు. డిశంబర్ నెలను ” ఎయిడ్స్ అవగాహనా మాసంగా ” పూనం మాలకొండయ్య ప్రకటించారు. “ప్రపంచ ఎయిడ్స్ దినం” డిసెంబర్ 1 నుండి నెలరోజులపాటు ఎయిడ్స్ వ్యాధి పై రాష్ట్ర వ్యాప్తంగా అవగాహనా కార్యక్రమాలను విసృతస్దాయి లో చేపట్టి సమాజంలోని అన్ని వర్గాలలో చైతన్యం తీసుకొనిరావాలని ఆదేశించారు. ఈ అవగాహనా కార్యక్రమాలు రాష్ట్రంలోని అన్ని డిగ్రీ,జూనియర్ కళాశాలల్లోను, స్వయం సహయ సంఘాలకు, వివిధ పరిశ్రమలల్లో పనిచేస్తున్న కార్మికులు, అన్ని మున్సిపాలిటీ, గ్రామపంచాయతీలలో హెచ్.ఐ.వి/ఎయిడ్స్ నిరోధం, వ్యాధి నిర్ధారణ, చికిత్స కేంద్రాల గురించి వ్యాధి అనంతరం తీసుకొనే జాగ్రత్తలు మరియు గోప్యత అంశాలపై సమాజంలోని అన్ని వర్గాలలో చైత్యన్యం తీసుకొనిరావాలని సూచించారు. అంతేకాకుండా ఆయా స్వచ్చంద సంస్ధలు (NGOs) లతో మరియు ఏపీ శాక్స్ డైరక్టర్, అదనపు సంచాలకులతోను, పట్టణ పేదరిక నిర్మూలనా సంస్ధ (MEPMA), గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్ధ (SERP) అధికారులతోను, పాజిటివ్ నెట్ వర్క్ ప్రతినిధులతో ఒక ప్రత్యేకమైన కమిటీని ఏర్పాటు చేసి ఒక ప్రత్యేక కార్యచరణ ప్రణాళికను రూపొందించాలని ఆదేశించారు. తదుపరి ప్రత్యేక కార్యనిర్వహక సమితి సమావేశాన్ని జనవరి నెలలో ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.ఈ సమావేశంలో అదనపు సంచాలకులు ఏపీ శాక్స్ ఇంచార్జి ప్రాజెక్ట్ డైరక్టర్ డా. గీతా ప్రసాదిని, ఏపీ వైద్య విధానపరిషత్ కమీషనర్ డా.దుర్గప్రసాద్, డి.ఎమ్.ఈ డా.సుబ్బారావు, ఏపీ శాక్స్ అదనపు ప్రాజెక్ట్ డైరక్టర్ డా.రాజేంద్రప్రసాద్ వాసవి మహీళ మండలి డైరక్టర్ డా.రస్మి, తెలుగు నెట్ వర్క్ ఆఫ్ పాజిటివ్ పిపుల్స్ ప్రతినిధి రమేష్ బాబు మరియు ఏపీ శాక్స్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *