శభాష్ ఎస్పీ..

కర్నూల్ రోడ్డులోని డాల్ఫిన్ రెస్డారెంట్ వద్ద మందుబాబులకు వార్నింగ్ ఇచ్చి వెళుతున్న జిల్లా ఎస్పీ సిద్దార్ద్ కౌశిల్

‘‘కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయటం అవసరమే…అలా చేయండి..ఇలా చేయండి’’ అంటూ అధికారులకు ఆదేశాలు ఇవ్వటమూ
అవసరమే..అంతకు మించి క్షేత్రస్థాయి వాస్తవాలను స్వయంగా తెలుసుకోవటం అత్యవసరం. అసలేం జరుగుతోంది..తనకు అందుతున్న సమాచారానికీ, వాస్తవాలకు మధ్య సామీప్యం ఎంత…శాంతిభద్రతల పరంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలేమిటి..పరిష్కారాలేమిటి…క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న హోం గార్డు నుంచి డిఎస్పీల దాకా వారి విధి విధానాలు ఎలా ఉండాలి..ఎలాంటి మార్పులు చేస్తే బాగుంటుంది..ఇలాంటి అనేక విషయాలపై దృష్టి పెట్టి అమలు  చేసి చూపిస్తున్న ప్రకాశం జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ సిద్దార్ద్ కౌశిల్ ప్రజల మన్ననలు అందుకుంటున్నారు. జీపులో వస్తాడో, కారులో వస్తాడో తెలియదు..లేదంటే రయ్యిన బుల్లెట్ పై దూసుకు వస్తాడో తెలియదు..అసలు ఎప్పుడు ఎక్కడి వస్తాడో తెలియదు..మొత్తానికి వస్తాడు…వాస్తవాలు తెలుసుకుంటాడు..‘ఇదీ స్థూలంగా ఎస్పీ సిద్దార్ద్ శైలి’.

పోలీసులకు ఆదేశాలిస్లూ…

జిల్లాలోని అనేక పోలీస్ స్టేషన్ల వద్దకు ఆయన వెళ్ళారు…అక్కడికి వెళ్ళటమే కాదు..అక్కడున్న ప్రత్యేక పరిస్థితులను బట్టి క్షేత్రస్థాయికి వెళ్ళి ప్రజలతో మాట్లాడుతున్నారు. జాగ్రత్తలు చెప్పటమే కాకుండా ప్రజల బాధ్యతలను కూడా గుర్తు చేస్తూ ఆ ప్రాంతాల్లో పోలీసులకు విధి విధానాలు ఎలా ఉండాలో సూచిస్తున్నారు. దొంగతనాలు, శాంతిభద్రతలు, సున్నితమైన సమస్యలు, రౌడీషీటర్ల కదలికలు, మందుబాబుల ఆగడాలు..ఇలా అన్ని విషయాలపై దృష్టి పెట్టాడు. తోక జాడిస్తే పోలీసులు తాట తీస్తారన్న సంకేతాలను అసాంఘిక శక్తులకు కలిగిస్తున్నారు. అంతేకాదు..సిన్సియర్ గా పోలీస్ డ్యూటీ చేయాలన్న సంకల్పంతో ఉన్న కొత్తగా వచ్చిన యువ పోలీసుల్లోనూ ఆయన స్ఫూర్తి నింపుతున్నారు. తానే బైక్ నడుపుతూ వెనుక పోలీస్ కానిస్టేబుల్ ను కూర్చోపెట్టుకుని రోడ్లపై రయ్ ను వెళుతుంటే పోలీసుల్లో కొత్త ఉత్సాహం వస్తోంది..జిల్లా కేంద్రమైన ఒంగోలులో శుక్రవారం రాత్రి 10.30 గంటల తరువాత ఆయన బైక్ నడుపుకుంటూ రోడ్డుమీదకు వచ్చారు. బార్లా తెరిచి ఉన్న బార్ అండ్ రెస్టారెంట్లు, రోడ్లపై మత్తెక్కి తిరుగుతున్న మద్యం బాబులు కంటపెట్టారు. వాళ్ళకు కిక్కు వదిలేలా క్లాస్ పీకారు. దీనిపై పోలీస్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

మనకు ఎస్పీ ఉన్నాడు…ఎస్పీ చూస్తున్నాడు..తస్మాత్ జాగ్రత్త..!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *