రాత్రికి రాత్రే గొప్ప క్రీడాకారులు కాలేరు : సానియా

రాత్రికి రాత్రే ఎవరూ గొప్ప క్రీడాకారులు కాలేరని టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా స్పష్టం చేశారు. ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు(జీఈఎస్ – 2017)లో భాగంగా రెండో రోజు క్రీడా పరిశ్రమలో వ్యాపార విజయం అంశంపై ప్రారంభమైన మాస్టర్ క్లాస్ సెషన్‌లో సానియా మాట్లాడారు. కొత్త క్రీడాకారులకు మరిన్ని ప్రోత్సాహకాలు అవసరమన్నారు. నిరంతర శ్రమ, పట్టుదలతోనే విజయాలు సాధ్యమవుతాయని చెప్పారు. అన్ని క్రీడల్లోనూ మహిళలు రాణిస్తున్నారని గుర్తు చేశారు సానియా. బాలీవుడ్ నటుల ప్రచారంతో క్రీడలు ప్రాచుర్యం పొందుతాయంటున్న వాదనను అంగీకరించనను అని ఆమె పేర్కొన్నారు. మేరీకోమ్ ఒలింపిక్‌లో పథకం సాధించకముందు ఎందరికి తెలుసు? అని సానియా అడిగారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *