కుప్పంలో మెజారిటీ తగ్గింది..క్షమించండి..

‘మెజారిటీ తగ్గింది..బాధగా ఉంది..క్షమించండి’ ..

‘మీ తప్పేమీ లేదు..మీ కష్టం మీరు పడ్డారు’…  ఇవీ, కుప్పం నేతలు, చంద్రబాబు మధ్య మాటలు.

కుప్పం నియోజకవర్గానికి చెందిన కొందరు నాయకులు సోమవారం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్దకు వచ్చిన ఆయనను కలిశారు. ఈ సందర్భంగా కుప్పంలో మెజారిటీ తగ్గటంపై నేతలకు, చంద్రబాబుకు మధ్య చర్చ జరిగింది. ఆధిక్యత తగ్గటానికి కారణాలేమిటో అన్వేషించాలనీ, నిశితంగా అధ్యయనం చేయాలని చంద్రబాబునాయుడు వారికి దిశా నిర్దేశం చేశారు. హంద్రీ-నీవా కాలువ ద్వారా కుప్పం శివారు వరకు నీళ్ళు తెచ్చామనీ, మరో అయిదేళ్ళు అధికారంలో ఉంటే ఆ ప్రాంతంలో సైబరాబాద్ స్థాయి నగరాన్ని నిర్మించి ఉండేవాళ్ళమని చంద్రబాబు వారితో అన్నారు. అసెంబ్లీ సమావేశాల తరువాత తాను కుప్పంలో పర్యటించనున్నట్టు వెల్లడించారు. ‘మనలో ఉన్న చిన్న చిన్న లోపాలను సవరించుకోవాలి..ఓటమి మనకు కొత్త కాదు..పోరాటంతో ముందుకు వెళదాం..వైకాపా అధికారంలోకి వచ్చింది..మ్యానిఫెస్టోలో చెప్పినవన్నీ అమలు చేయాల్సిందిగా వత్తిడి తీసుకురావాలని అన్నారు. కుప్పం నేతలు కూడా ప్రాణాలకు తెగించి పోరాడతామనీ, పార్టీని కాపాడుకుంటామని హామీ ఇచ్చారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *