టిటిడి చైర్మన్ గా వై.వి సుబ్బారెడ్డి

నేడో, రేపో అధికారిక ఉత్తర్వులు

ఒంగోలు లోక్ సభ మాజీ సభ్యుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటీలో ముఖ్యుడైన వై.వి సుబ్బారెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) చైర్మన్ గా నియమితుడు కానున్నట్టు విశ్వసనీయ సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ఉత్వర్వులు నేడో, రేపో వెలువడే అవకాశం ఉంది. 2014లో ఒంగోలు లోక్ సభ నుంచి గెలుపొందిన వై.వికి 2019లో పార్టీ అవసరాల దృష్ట్యా టికెట్ ఇవ్వలేకపోయారు. తన సిట్టింగ్ స్థానాన్ని మాగుంట శ్రీనివాసరెడ్డికి కేటాయించారు. వైకాపా ఆవిర్భావం నుంచి పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ జగన్ కు అన్ని విధాలుగా అండగా ఉన్న వై.వి ఉభయగోదావరి జిల్లాల ఇన్ చార్జిగా కూడా పనిచేశారు. వివాద రహితునిగా పేరొందిన వై.వికి రాజ్యసభ సభ్యత్వం ఇస్తారని ప్రచారం జరిగినా, ఇపుడు కేబినెట్ హోదా కలిగిన టిటిడి చైర్మన్ పోస్ట్ ఇవ్వటానికే ముఖ్యమంత్రి జగన్ మొగ్గచూపినట్టు తెలుస్తోంది.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *