నేను హిందువునే : వై.వి సుబ్బారెడ్డి

ఒకటి కాదు..రెండు కాదు, నూటికి నూరు శాతం తాను హిందువునని ఒంగోలు మాజీ ఎంపి, వైకాపా సీనియర్ నాయకుడు వై.వి సుబ్బారెడ్డి ప్రకటించారు. టిటిడి చైర్మన్ గా వైవి నియమాకం ఖరారైన నేపథ్యంలో కొందరు సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారంపై శుక్రవారం ఆయన అమరావతిలో మీడియాకు వివరణ ఇచ్చారు. తాను వందశాతం హిందువుననీ, తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి తమ ఇష్టదైవమని స్పష్టం చేశారు. ఈ పదవి కోసం తనను పరిశీలనలోకి తీసుకోగానే కొందరు గిట్టనివారు తాను క్రిస్టియన్‌ని అంటూ తప్పుడు ప్రచారాన్ని సామాజిక మాధ్యమాల్లో మొదలు పెట్టారని ఆయన విమర్శించారు.సీఎం జగన్‌ కు బాబాయి అయిన సుబ్బారెడ్డికి టీటీడీ చైర్మన్‌ పదవి ఇస్తున్నారనగానే ఆయన క్రిస్టియన్‌ అన్న వార్తలు వెల్లువెత్తాయి.ఓ హిందు ధార్మిక సంస్థ పదవిని క్రిస్టియన్‌కి ఎలా కేటాయిస్తారని, ఎవరినైనా హిందువును ఆ పదవిలో నియమించాలంటూ విమర్శలు పెరగడంతో సుబ్బారెడ్డి ఈ అంశంపై క్లారిటీ ఇచ్చారు.తాను హిందువును కాదన్న విషయంలో అనుమానాలు అక్కర్లేదన్నారు.టీటీడీ చైర్మన్‌గా ఉండాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తనకు అవకాశం ఇచ్చారనీ, దైవ సేవకు నన్ను పంపుతున్నందున తప్పకుండా దాన్ని సద్వినియోగం చేసుకుంటానని తెలిపారు.టీటీడీనే కాదు భవిష్యత్తులో ఏ బాధ్యత అప్పగించినా చిత్తశుద్ధితో విధులు నిర్వహిస్తానన్నారు.బాధ్యతలు చేపట్టాక ముఖ్యంగా స్వామివారి ఆస్తులు, ఆభరణాల విషయంలో వాస్తవాలు రాబడతామన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని జగన్‌ కచ్చితంగా నెరవేరుస్తారని తెలిపారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *