ఏపీలో మరో ప్లాంటుకు షావొమి ఆసక్తి

మఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ను కలిసిన షావొమి బృందం
మొబైల్‌ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్‌ సహా ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీపై ప్రణాళికలు

షావొమి ఇండియా ప్రతినిధులతో ముఖ్యమంత్రి వైయస్‌.జగన్మోహన్‌ రెడ్డి షావొమి ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ మనుకుమార్‌ జైన్‌, ఫావొమి ఇండియా చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ మురళీకృష్ణన్

అమరావతి: దేశంలో అతిపెద్ద మొబైల్‌ఫోన్లను విక్రయిస్తున్న షావోమి కంపెనీ ప్రతినిధులు సీఎం శ్రీ వైయస్‌.జగన్మోహన్‌రెడ్డిని కలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కంపెనీ విస్తరణ ప్రణాళికలను గౌరవ ముఖ్యమంత్రితో పంచుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో రెండో చోట, తిరుపతి సమీపంలో మొబైల్‌ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తుల తయారీపై తమకు ఆసక్తి ఉన్నట్టు వెల్లడించారు. ఎలక్ట్రిక్‌ సైకిళ్లు, ట్రైసైకిళ్లు, స్కూటర్ల తయారీ ఆలోచన కూడా ఉందని సీఎంకు తెలిపారు. తయారీ ప్లాంటును ఆంధ్రప్రదేశ్‌లో పెట్టేందుకు అవసరమైన సహాయ, సహకారాలను అందించడానికి సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ షావొమి ప్రతినిధులకు వెల్లడించారు. పోర్టుకూడా సమీపంలో ఉండడంతో తిరుపతిలోని రేణిగుంట ప్రాంతమైతే బాగుంటుందన్న అభిప్రాయాన్ని షావొమి ప్రతినిధులు వ్యక్తంచేశారు. గౌరవ ముఖ్యమంత్రిని కలిసిన వారిలో షావొమి ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ మనుకుమార్‌ జైన్, ఫావొమి ఇండియా చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ ముకళీకృష్ణన్‌ ఉన్నారు. సమావేశంలో ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పి.వి.రమేష్‌ పాల్గొన్నారు.

దేశంలో మొబైల్‌ ఫోన్లు, స్మార్ట్‌ టీవీల విక్రయాల్లో షావొమి అగ్రస్థానంలో ఉంది. భారత్‌లో 40 శాతం స్మార్ట్‌ టీవీలను, 35శాతం మొబైల్‌ ఫోన్లను షావొమి విక్రయిస్తోంది. ప్రపంచంలో నాలుగో అతిపెద్ద కంపెనీగా కొనసాగుతోంది. షావొమి విక్రయిస్తున్న స్మార్ట్‌ ఫోన్లలో 90శాతం నెల్లూరులోని శ్రీసిటీలో తయారవుతున్నాయి. చిత్తూరు జిల్లా రేణిగుంట ప్రాంతంలో ఉన్న ఎలక్ట్రానిక్స్‌పార్క్‌లో మొబైల్‌ విడిభాగాలే కాకుండా ఎలక్ట్రానిక్స్‌ వస్తువుల తయారీకి చాలా కంపెనీలు ఆసక్తిచూపిస్తున్నాయి.

 

Hits: 19

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *