చిదంబరం అరెస్ట్..

గోడదూకి ఇంట్లోకి ప్రవేశించిన సిబిఐ అధికారులు

ఢిల్లీలో ఇంటి వద్ద గంటపాటు హై డ్రామా

కేంద్ర మాజీ ఆర్ధిక, హోంశాఖ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పి.చిదంబరాన్ని సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఢిల్లీలోని ఆయన ఇంటి వద్ద సుమారు గంటసేపు నడిచిన హైడ్రామా అనంతరం సిబిఐ అధికారులు గోడ దూకి ఆయన ఇంట్లోకి ప్రవేశించి అరెస్ట్ చేశారు. ఐఎన్ఎక్స్ మీడియా కుంభకోణంలో తీవ్రమైన ఆర్ధిక నేరాల తాలుకు అభియోగాలను ఎదుర్కొంటున్న ఆయనకు ముందస్తు బెయిల్ ను న్యాయస్థానం తిరస్కరించటంతో సిబిఐ అధికారులు అరెస్ట్ కు ఉపక్రమించారు. సిబిఐతో పాటు ఈడీ అధికారులు ఆయన ఇంటికి రాగా వ్యక్తిగత సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఢిల్లీ పోలీసుల సహకారంతో గోడదూకి ఇంట్లోకి ప్రవేశించి చిదంబరాన్ని అరెస్ట్ చేశారు.

Hits: 285

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *