ఎక్కడికక్కడే వర్షపు నీరు

చెరువును తలపిస్తున్న హౌసింగ్ బోర్డు
విజృంభిస్తున్న దోమలతో
నివాసితుల నానా అవస్థలు

భారీ వర్షాల ధాటికి ఒంగోలు హౌసింగ్ బోర్డు ప్రాంతమంతా జలమయమైంది. డ్రైనేజి వ్యవస్థ లేకపోవటంతో వర్షపు నీరు ఎక్కడికక్కడే నీళ్లు నిలిచిపోయింది. దీంతో ఆ ప్రాంతమంతా చెరువును తలపిస్తోంది. దోమలు విజృంభిస్తున్నాయి. రాత్రివేళల్లోనే కాకుండా పగలు కూడా దోమలు స్వైరవిహారం చేస్తూ ఉండటంతో వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని అపార్ట్ మెంటుతో పాటు అక్కడి చుట్టుపక్కల నివాసితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేకించి హౌసింగ్ బోర్డ-బ్యాంకు కాలనీ సమీపంలో ఉన్న వి.ఆర్ అపార్ట్ మెంటు చుట్టూ వర్షపు నీరు నిలిచిపోయింది. అక్కడి నివాసితులు రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారు. ఒక వైపు హౌసింగ్ బోర్డు, భాగ్యనగరానికీ, మరో వైపు బైపాస్ రోడ్డుకు అనుసంధానంగా ఉన్న ఆ ప్రాంతంలో రోడ్డు, డ్రయినేజి వ్యవస్థను ఏర్పాటు చేయాలని గడిచిన ఎనిమిదేళ్ళుగా అపార్ట్ మెంటు వాసులు కోరుతున్నా మున్సిపల్ అధికారులు పట్టించుకోలేదు. ఇకనైనా పట్టించుకోవాలనీ, తక్షణం రోడ్డు, డ్రైనేజి నిర్మాణానికి పూనుకోవాలని కోరుతున్నారు.

Hits: 221

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *