వైకాపాలో రామనాధంబాబు

ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో చేరిక

పాల్గొన్న బాలినేని, నందిగం సురేష్ తదితరులు

ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గానికి చెందిన టిడిపి ముఖ్యనేత రామనాథంబాబు గురువారం వైసీపీలో చేరారు. అమరావతిలో ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. ఆయనకు జగన్ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. రామనాథంబాబుతో పాటు ఆయన అనుచరులు కూడా పార్టీలో చేరారు. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, బాపట్ల ఎంపి నందిగం సురేష్, బత్తుల బ్రహ్మానంరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

జగన్ సమక్షంలో పార్టీలో చేరిన రామనాధంబాబు, పక్కన బాలినేని, నందిగం సురేష్, సజ్జల రామక్రిష్ణారెడ్డి తదితరులు

Hits: 374

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *