నాసా చిత్రాలు..విక్రమ్ ల్యాండింగ్ ఇక్కడే…

చంద్రయాన్-2కు సంబంధించి అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) తాజాగా ఫొటోలను విడుదల చేసింది. లునా4ర్ రికనైజాన్స్ ఆర్బిటర్ కెమెరా చంద్రుని సమీప కక్ష్యలో తిరుగుతున్న సమయంలో ఈ ఫొటోలను లభ్యమయ్యాయి. అంతరిక్ష పరిశోధనా పరిణామక్రమంతో ఈ ఫొటోలు చరిత్రతో భద్రపరుచుకోవాల్సిన అరుదైనవిగా నిలిచిపోనున్నాయి. చంద్రయాన్ 2 నుంచి వేరయిన విక్రమ్ ల్యాండర్ చంద్రునిపై హార్డ్ ల్యాండింగ్ అయిన ప్రదేశంలో పరిస్థితిని ఈ చిత్రాలు పట్టి చూపిస్తున్నాయి. విక్రమ్ ల్యాండర్ అత్యంత సున్నితంగా ల్యాండ్ అయ్యేందుకు మన ఇస్రో విశ్వ ప్రయత్నాలు చేసినా సాధ్యం కాలేదు. హార్డ్ ల్యాండింగ్ తో ‘విక్రమ్’తో సంబంధాలు తెగిపోయాయి. నాసా ఇపుడు విక్రమ్ హార్డ్ ల్యాండింగ్ జరిగిన చంద్రుని చుట్టూతా సుమారు 150 కిలోమీటర్ల వ్యాసార్ధంలో ఫొటోలను తీయగలిగింది. అయితే, ఖచ్చితంగా ఎంత దూరంలో విక్రమ్ ల్యాండ్ అయిందనే విషయం ఇంకా నిర్దిష్టంగా నిర్దారణ కాలేదు.

చంద్రయాన్-2 షెడ్యూల్

Hits: 423

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *