మూడు కోట్ల అమ్మవారు

కరెన్సీ కట్టలతో అలంకరణ

దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడు కోట్ల రూపాయలతో అమ్మవారికి చేసిన అలంకరణ గుంటూరులో భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. గుంటూరులోని ఆర్.అగ్రహారంలో కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో శరన్నవరాత్రుల్లోని అయిదోరోజు అమ్మవారు ధనలక్ష్మి రూపంలో భక్తులకు దర్శనమిచ్చింది. ఈ సందర్భంగా మూడు కోట్ల రూపాయల డబ్బుకట్టలతో అమ్మవారిని భక్తులు అలంకరించారు. అమ్మవారి మూల విరాట్టుతోపాటు కల్యాణ మండపంలోని ఉత్సవ విగ్రహానికి చేసిన ఈ అలంకరణను చూసేందుకు భక్తులు పోటెత్తారు.ఆలయ ప్రాంగణంలోని నీటి మడుగులో అత్తివరదరాజ స్వామి నమూనా విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు

Hits: 1

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *