కోడెల శివరామ్ కు బెయిల్ మంజూరు

అసెంబ్లీ ఫర్నీచర్ ను తన టు వీలర్ షోరూంకు తరలించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న కోడెల శివరామకృష్ణకు హైకోర్టు షరతులతో కూడిని బెయిల్ ను మంజూరు చేసింది. ఈనెల 9లోపు దిగువ కోర్టులో లొంగిపోవాలనీ, 20 వేల రూపాయల చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని షరతు విధించింది. సాక్షులను ప్రభావం చేయవద్దనీ, పోలీసుల విచారణకు పూర్తి సహకారం అందించాలని కోర్టు ఆదేశించింది. అసెంబ్లీ ఫర్నీచర్ ను నిబంధంనలకు విరుద్ధంగా గుంటూరులోని తన షోరూంకు తరలించి వాడుకుంటున్నారని కోడెల శివరామ్ పై తుళ్ళూరు పోలీసులు కేసులు నమోదు చేశారు.

Hits: 4

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *