దక్షిణ కొరియాలో భారీ అగ్ని ప్రమాదం

దక్షిణకొరియాలోని జెచెన్ నగరంలోని ఓ జిమ్లో గురువారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 18మంది సజీవ దహన మయ్యారు. మరికొందరు మంటల్లో చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేసే పనిలో నిమగమయ్యారు. భవనంలో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్న రెస్క్యూ టీం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *