సరస్వతీదేవిగా బెజవాడ దుర్గమ్మ

సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా
పద్మపత్ర విశాలాక్షీ పద్మకేసరవర్జినీ నిత్యం పద్యాలయాదేవి సామాంపాతు సరస్వతీ
శరన్నవరాత్రుల్లో 7వ రోజైన శనివారం (ఆశ్వయుజ శుద్ధ సప్తమి) ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గమ్మ శ్రీ సరస్వతి దేవిగా భక్తులకు సాక్షాత్కరిస్తున్నారు. శరన్నవరాత్రి మహోత్సవములలో శ్రీ అమ్మవారిని శ్రీ సరస్వతీ దేవిగా అలంకరిస్తారు. మూలా నక్షత్రం అమ్మవారి జన్మనక్షత్రం. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిగా త్రిశక్తి స్వరూపిణియైన దుర్గాదేవి తన అంశలోని నిజస్వరూపాన్ని సాక్షాత్కరింప చేయడమే మూలా నక్షత్రంనాడు చేసే అలంకార ప్రత్యేకత. చింతామణి, జ్ఞాన, నీల, ఘట, కిణి, అంతరిక్ష మహా సరస్వతులుగా సప్తనామాలతో కొలువులందుకొనే వాగ్దేవి ప్రాణుల నాలుక పై నర్తించే బుద్ద ప్రదాయిని. మూలా నక్షత్రం నుండి విజయదశమి వరకు విశేష పుణ్యదినాలుగా ఆరాధిస్తారు. శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు జన్మనక్షత్రం కావడం పట్ల భక్తులు తెల్లవారు జాము నుండే భక్తులు అధిక సంఖ్యలో శ్రీ సరస్వతిదేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో వస్తున్నారు.

సరస్వతీదేవిగా దర్శనమిస్తున్న బెజవాడ దుర్గమ్మ

 

Hits: 176

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *