ప్రధాని నరేంద్రమోడీతో జగన్ భేటీ

రైతు భరోసాకు ముఖ్యఅతిధిగా

రావాల్సిందిగా ఆహ్వానం..

45 నిముషాల పాటు భేటీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ అయ్యారు. ఢిల్లీకి  శనివారం మధ్యాహ్నం ఆయన సాయంత్రం 4:30 గంటలకు ప్రధానితో సమావేశమయ్యారు. వీరిద్దరి భేటీ 45 నిముషాల పాటు కొనసాగినట్టు సమాచారం. నవరత్నాల్లో ఒకటైన రైతు భరోసా కార్యక్రమాన్ని ఈనెల 15న ప్రారంభించనున్న నేపథ్యంలో ప్రధానమంత్రి మోడీని ముఖ్యఅతిథిగా రావాల్సిందిగా ఆహ్వానించినట్టు తెలిసింది. పిపిఎల పునసమీక్ష, రివర్స్ టెండరింగ్ విధి విధానాలనూ, వాటి వల్ల ఒనగూరుతున్న ప్రయోజనాలతో పాటు వెనుకబడిన జిల్లాల అభివృద్ది, రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి ప్రధానితో జగన్ చర్చించినట్టు సమాచారం.

ప్రధానిమంత్రి నరేంద్రమోడీకి శాలువా కప్పి శ్రీవారి ఫొటోను అందచేస్తున్న ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి

Trending News

Hits: 180

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *