రవి ప్రకాష్ అరెస్ట్ : జైలుకు తరలింపు

ధృవీకరించిన బంజారాహిల్స్ పోలీసులు

చంచల్ గూడ జైలుకు రవిప్రకాష్ 

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ ను హైదరాబాద్ లోని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం మధ్యాహ్నమే ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ అనంతరం అరెస్ట్ చేసినట్టు సాయంత్రం అధికారికంగా ప్రకటించారు. టీవీ9 యాజమాన్య సంస్థ అయిన అసోసియేట్ బ్రాడ్ కాస్ట్ లిమిటెడ్ నుంచి నిబంధనలకు విరుద్ధంగా సుమారు 18 కోట్ల రూపాయలను రవిప్రకాష్ తీసుకున్నట్టు ఆ సంస్థ ఆరోపించింది. బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌, షేర్‌ హోల్డర్ల ఆమోదం తీసుకోకుండా కంపెనీ ఖాతా నుంచి నిధులను తీసుకున్నట్టు ఆరోపించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలను పోలీసులకు అందించింది. రవిప్రకాష్ తో పాటు టివి9 మాజీ సీఎఫ్‌వో ఎంకేవీఎన్‌ మూర్తి  కూడా ఈ నేరంలో భాగస్వామిగా ఉన్నాడని ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు విచారణ చేపట్టి ఆధారాలు లభ్యం కావటంతో రవిప్రకాష్ ను అరెస్ట్ చేశారు.వీరిపై ఐపిసి సెక్షన్ 409, 418, 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు వెస్ట్ జోన్ డీసీపీ సుమతి తెలిపారు.

update news.. చంచల్ గూడ జైలుకు రవిప్రకాష్

టీవీ9 మాజీ సీిఇవో రవిప్రకాష్ ను బంజారాహిల్స్ పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించారు. అసోసియేట్ బ్రాడ్ కాస్ట్ లిమిటెడ్  నుంచి నిబంధనలకు విరుద్దంగా సుమారు 18 కోట్ల రూపాయలు డ్రా చేసుకున్నారన్న ఆరోపణపై రవిప్రకాష్ ను అరెస్ట్ చేసి న్యాయమూర్తి ముందు హాజరుపర్చగా రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు ఆయనను చంచల్ గూడ జైలుకు తరలించారు.

జైలుకు వెళుతూ చేతులు ఊపుతున్న రవిప్రకాష్
cinema news

 

 

Hits: 732

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *