రవిప్రియ మాల్ లో ఆటోమొబైల్ షో

ఆకట్టుకుంటున్న ప్రముఖ కంపెనీల వాహనాలు
షోను ప్రారంభించిన మాల్ చైర్మన్ కంది రవిశంకర్

షోను ప్రారంభిస్తున్న రవిప్రియ మాల్ చైర్మన్ కంది రవిశంకర్

ఒంగోలులోని గుంటూరు రోడ్ లో ఉన్న రవిప్రియ మాల్ అండ్ మల్టీప్లెక్స్ లో ‘ఆటోమొబైల్ షో 2019’ ఘనంగా ప్రారంభమైంది. ది టీమ్ సి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ షోను రవిప్రియ మాల్ చైర్మన్ కంది రవిశంకర్ ప్రారంభించారు. ఒంగోలు లో తొలిసారిగా మల్టీ బ్రాండ్ కార్న్ & బైక్స్ ఆటో మొబైల్ షో ఏర్పాటుకావటం ఇదే ప్రథమమని నిర్వాహకులు తెలిపారు. ఈ షోలో అనేక నేషనల్ అండ్ ఇంటర్ నేషనల్ కార్స్ బైక్స్, మెర్స్ బెంజ్ టెనెల్లి ,హ్యుండై ,టీవీఎస్ ,మహీంద్ర, క్వాసాకి ,ఇసుజు, మారుతి సుజుకి ,స్కోడా ఆటో, టాటా కంపెనీకి చెందిన వాహనాలను ప్రదర్శనకు ఉంచారు. ఈ షో చూపరులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈనెల 5,6 శని, ఆదివారాలు ఈ షో అందుబాటులో ఉంటుంది. ఈ సందర్భంగా మాల్ చైర్మన్ కంది రవిశంకర్ మాట్లాడుతూ ఈ ఈవెంట్ రవిప్రియ మాల్ నిర్వహించటం చాలా ఆనందంగా ఉందన్నారు. మాల్ లో తాజాగా మేజిక్ వరల్డ్ అండ్ ఎఆర్ ను కూడా ప్రారంభించినట్టు తెలిపారు. ఈ షోలో పాల్గొన్న వారికి LUKY DRAW శివాని షాపింగ్ లక్కీ డ్రా బహుమతిని అందించనుంది. ఒంగోలు మంగమూరు రోడ్డులోని మంగమూరురోడ్ లోని బి.ఎం.ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ కు చెందిన బి.ఎం.ఆర్ అర్జున్, మాల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కంది సాయినాధ్, మాల్ డైరెక్టర్ కంది విష్ణుమోహన్, కార్స్ అండ్ బైక్స్ కంపెనీ సిబ్బంది పాల్గొన్నారు.

మాట్లాడుతున్న రవిప్రియ మాల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కంది సాయినాధ్

Trending News

 

Hits: 65

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *