జగన్ సీరియస్

డీజీపీ గారూ..టేక్ యాక్షన్
ఆ తరువాతే కోటంరెడ్డి అరెస్ట్

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విషయంలో ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది..‘డిజీపీ గారూ..చట్టం ముందు అందరూ సమానులే..ఆధారాలుంటే చర్యలు తీసుకోండి’ అంటూ జగన్ ఆదేశించిన తరువాతనే కోటంరెడ్డి అరెస్ట్ అయ్యారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని శనివారం రాత్రికి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకున్న జగన్ కు డిజీపి గౌతం సవాంగ్ నుంచి కోటంరెడ్డి దౌర్జన్యంపై సమాచారం అందింది. మహిళా అధికారిపై దౌర్జన్యం చేయటం పల్ల సీరియస్ అయిన జగన్ ‘ఆధారాలుంటే చర్యలు తీసుకోండి సర్.. టేక్ యాక్షన్’ అంటూ డీజీపికి ఆదేశాలు జారీ చేసినట్టు విశ్వసనీయ సమాచారం. ఆ తరువాతే కోటంరెడ్డి అరెస్ట్ పై పోలీసులు రంగంలోకి దిగారు. ఇంటిదగ్గర కాపలా కాసి మరీ ఆయనను వేకువజామున అరెస్ట్ చేశారు. జగన్ తీసుకున్న నిర్ణయం రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇది మంచి సంకేతమని ప్రజలు భావిస్తున్నారు.

Trending News

Hits: 678

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *