బిజెపి భిక్షాటన

గుంటూరులో కన్నా ఆధ్వర్యంలో నిరసన 

గుంటూరులోని పట్నం బజారులో సోమవారం బిజెపి భిక్షాటన కార్యక్రమం నిర్వహించింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ స్వయంగా ఈ భిక్షాటనలో పాల్గొన్నారు. రాష్ట్రంలో తీవ్రమైన ఇసుక కొరతకు నిరసనగా బిజెపి రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ‘భిక్షాటన’కు పిలుపునిచ్చింది. గుంటూరులో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, భవన నిర్మాణ కార్మికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

 

Hits: 41

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *