జగన్ పై సోషల్ మీడియాలో దుష్ప్రచారం

డిజిపిని సవాంగ్ ను కలిసిన వైకాపా ఎమ్మెల్యేలు

రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి చెందిన సోషల్ మీడియాలో అసభ్యంగా, అభ్యంతరకరమైన రీతిలో పోస్టులు పెడుతున్నారని వైకాపా ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఈ మేరకు డిజిపి గౌతం సవాంగ్ ను సోమవారం కలిసి వినతిపత్రం సమర్పించారు. నిబంధనలకు విరుద్దంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. జగన్ పై అభ్యంతకరంగా పోస్టులు పెడుతున్న సైట్ల వివరాలను, అభ్యంతరకర పోస్టులను డిజిపికి ఇచ్చిన వినతిపత్రానికి జతచేశారు. డిజిపి సవాంగ్ ను కలిసి వారిలో తాడికొండ, సంతనూతలపాడు, పెడన ఎమ్మెల్యేలు డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి, సుధాకర్ బాబు, జోగి రమేష్ తదితరులు ఉన్నారు.

బాలకృష్ణ కార్యాలయమే అడ్డా

మీడియాతో మాట్లాడుతున్న ఎమ్మెల్యేలు

డిజిపిని కలిసిన అనంతరం ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ లో్ని నందమూరి బాలకృష్ణ కార్యాలయం వేదికగా జగన్ పై సోషల్ మీడియా కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. జగన్ పై అసభ్యకరంగా పోస్టులు పెట్టేందుకు గాను టిడిపి సోషల్ మీడియాలో సుమారు రెండు వేల మంది పనిచేస్తున్నారని ఆరోపించారు. దీనిపై పోలీస్ ఉన్నతాధికారులు తక్షణం చర్యలు తీసుకోవాలని కోరారు.

Trending News

Hits: 270

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *