యాపిల్‌వ్యాలీ లో అద్భుత దృశ్యం

కాలిఫోర్నియాకు 321 కిమీ దూరంలోని యాపిల్‌వ్యాలీ నుంచి కూడా ఆకాశంలో కనిపిస్తున్న అద్భుతమైన కాంతిపుంజమిది.దక్షిణ కాలిఫోర్నియాలో చిన్నగా మొదలైన కాంతి.. చివరకు హంసను పోలిన ఆకృతితో ఆశ్చర్యపోయేలా చేసింది.ఇది చూసిన స్థానికులు.. కాలిఫోర్నియాపై యూఎఫ్‌ఒ దాడి చేసిందని, ఏలియన్లే వచ్చి ఉంటారని రకరకాల ఊహాగానాలకు సామాజిక మాధ్యమాల్లో
తెరలేపారు.కాలిఫోర్నియా అగ్నిమాపక శాఖ సైతం ‘అర్థంకాని కాంతి ఏదో ఆకాశంలో కనిపిస్తోంది’ అని ప్రకటించడంతో ప్రజలు భయాందోళన చెందారు.భయపడాల్సి ఏమీ లేదని, ఇరిడియం కమ్యూనికేషన్స్‌ అనే సంస్థ కోసం ‘స్పేస్‌ ఎక్స్‌’ అనే కంపెనీ.. ఫాల్కన్‌ 9 రాకెట్‌లో పది ఉపగ్రహాలను ఆకాశంలోకి తీసుకెళ్లిందని ప్రభుత్వం ప్రకటించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *