కంది రైతులను ఆదుకుంటాం…

కేంద్రం కొనగా మిగిలిన మార్కెటింగ్ శాఖ ద్వారా 

మిగిలిన పంట కొనుగోలు 

రాష్ట్ర మంత్రులు సోమిరెడ్డి, ఆదినారాయణ రెడ్డి

సచివాలయం, మార్చి 3 : రాష్ట్రంలో కంది రైతులను ఆదుకోడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, రాష్ట్ర మార్కెంటింగ్ శాఖ మంత్రి సీహెచ్. ఆదినారాయణరెడ్డి తెలిపారు. మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి…సచివాలయంలోని రెండో బ్లాక్ లో ఉన్న తన కార్యాలయంలో మరో మంత్రి ఆదినారాయణ రెడ్డితో కలిసి వ్యవసాయ, మార్కెటింగ్ శాఖాధికారులతో సమీక్షా సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ ఏడాది రాష్ట్రంలో కందుల దిగుబడి భారీగా పెరిగిందన్నారు. కంది రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో, పంటనంతా కొనుగోలు చేయాలని సీఎం చంద్రబాబునాయుడు ఆదేశించారన్నారు. కేంద్ర ప్రభుత్వం నాఫెడ్ ద్వారా 45 వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడానికి ముందుకొచ్చిందని మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి తెలిపారు. మిగిలిన పంటను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి, రైతులకు భరోసా ఇవ్వనుందన్నారు. మొదటగా ప్రతి రైతు నుంచి 25 క్వింటాల చొప్పున కందులు కొనుగోలు చేస్తామన్నారు. మిగిలిన పంట ఎంత ఉందో లెక్కించి, తగు నిర్ణయం తీసుకుంటామని మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆదినారాయణరెడ్డి తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో రాష్ట్ర వ్యవసాయశాఖ, మార్కెటింగ్ కమిషనర్లు హరిజవహర్ లాల్, శామ్యూల్ ఆనంద్, మార్క్ ఫెడ్ ఎం.డి. మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *