మెప్మాకు అవార్డులు

ఢిల్లీలో కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ మాత్యులు హారదీప్ సింగ్ పూరి  చేతుల మీదుగా మెప్మా పట్టణ సమాఖ్యలు అవార్డులను అందుకున్నారు. గృహ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛత ఎక్సెలెన్స్ అవార్డులలో మెప్మా పట్టణ సమాఖ్యలు అవార్డులను పొందయి. మొత్తం 57 అవార్డులు ప్రకటించగా 10 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మెప్మా పట్టణ సమాఖ్యలకు దక్కాయి. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్నందుకుగాను మెప్మా పట్టణ సమాఖ్యలకు కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డులను ప్రకటించింది. ఇందులో గుంటూరుకు రెండు అవార్డులు రాగా నరసరావుపేట, తెనాలి, సత్తెనపల్లి, చీరాల, చీమకుర్తి, సామర్లకోట, నెల్లిమర్ల మరియు సాలూరు పట్టణ మెప్మా సమాఖ్యలు ఒక్కో అవార్డును పొందినాయి. ODF సిటీలు మరియు పట్టణ పరిశుభ్రత కార్యక్రమాలలో పాల్గొని ఈ రోజు భారత ప్రభుత్వంచే స్వచ్చత ఎక్సలెన్స్ అవార్డులు స్వీకరించిన మెప్మా పట్టణ సమాఖ్యలు రాష్ట్ర గౌరవాన్ని జాతీయ స్థాయిలో గర్వపడేలా చేసారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు అభినందించారు. జాతీయ స్థాయిలో 10 అవార్డులు రావడం ఆంధ్రప్రదేశ్ మహిళా శక్తికి నిదర్శనమని అందరి ప్రసంసలను పొందుతున్నాయి అని మెప్మా ఎండీ పి. చిన్నతాతయ్య గారు హర్షం వ్యక్త్యం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *