అరచేతిలో వార్తా ప్రపంచం

ప్రపంచ వ్యాప్తంగా వెబ్ సైట్ వీక్షకుల సంఖ్య  గణనీయంగా పెరుగుతోంది. పత్రికలు, టి.విలకు పోటీగా వెబ్ సైట్లు కూడా ప్రజల ఆదరణ పొందుతున్నాయి. ఇంటింటికి నెట్, చేతిలో స్మార్ట్ ఫోన్ ఒక అవసరంగా మారిపోయిన కాలంలో ఆన్ లైన్ వార్తలు కూడా టి.విలు, పత్రికలతో పోటీ పడుతున్నాయి. మన రాష్ట్రంలో హైదరాబాద్ కేంద్రంగా నడిచే వెబ్ సైట్లు, అందులోనూ సినీ వార్తలే ప్రధాన కంటెంట్ గా భావించి నడిపిస్తున్న వెబ్ సైట్లు తప్ప రాజకీయ, సామాజిక కథనాలు, ప్రతి క్షణం వార్తల అప్ డేట్ తో కూడిన తెలుగు వెబ్ సైట్లు వ్రేళ్ళ మీద లెక్కించదగ్గ స్థాయిలోనే ఉన్నాయి.  ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తరువాత ఆంధ్రప్రదేశ్ లో ఆ కొరత ఎక్కువగానే ఉంది. ఈ నేపథ్యంలో ఏపీలో ఒక న్యూస్ వెబ్ సైట్ అవసరం ఎంతగానో ఉందని అనిపించింది. andhravani.net  పేరుతో వెబ్ సైట్ ప్రారంభించాము. సుదీర్ఘకాలం  వివిధ పత్రికల్లో, వివిధ హోదాల్లో పనిచేసిన అనుభవంతో,  ప్రజల సామాజిక జీవితంలో కష్టాలు,కన్నీళ్ళు,కేరింతలు..ఇలా అన్ని పార్శ్వాలను స్పృశించి అక్షరీకరించే నిబద్ధతతో కూడిన పాత్రికేయ విలువలను కాపాడుకుంటూ వెబ్ సైట్ నిర్వహించాలని నిర్ణయించుకున్నాం. వెబ్ సైట్ కంటెంట్, ఆధునీకరణకు మీ విలువైన సలహాలు, సూచనలను స్వీకరిస్తున్నాం.  వివిధ రంగాలపై మీ వ్యాసాలను ఆహ్వానిస్తున్నాం. సాహిత్య వ్యాసాలకు, కవితలకు సాదర స్వాగతం పలుకుతున్నాం.

andhravani.net కు మీ అభిప్రాయాలు, వ్యాసాలు, ఫొటోలు ఈ కింది ఇ.మెయిల్ కు పంపించగలరు

andhravani2015@gmail.com

[contact-form][contact-field label=”Name” type=”name” required=”true” /][contact-field label=”Email” type=”email” required=”true” /][contact-field label=”Website” type=”url” /][contact-field label=”Message” type=”textarea” /][/contact-form]

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *